సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' టైటిల్ పోస్టర్ విడుదల 
Advertisement
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ సరసన నభా నటేశ్ నటిస్తోంది. మరోవైపు, సాయి ధరమ్ తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే' చిత్రం ఇటివలే రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
Mon, Oct 07, 2019, 11:48 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View