మమ్మల్ని అంతమాట అంటారా?: దిగ్విజయ్‌సింగ్‌పై వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్ ఫైర్
07-10-2019 Mon 08:53
- దిగ్విజయ్ గూఢచర్యం ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన అలోక్ కుమార్
- సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్
- ఇలాంటి ఆరోపణలతో వాతావరణం దెబ్బతింటుందని వ్యాఖ్య

పాకిస్థాన్ ఐఎస్ఐ తరపున భజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మండిపడ్డారు. ఆయన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయనను శిక్షించాల్సిందేనన్నారు. ఇలాంటి అర్థంపర్థంలేని ఆరోపణల కారణంగా దేశంలో వాతావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయనకు కొత్తకాదని, గతంలోనూ హిందూ తీవ్రవాదం పేరుతో ఆరోపణలు చేశారని అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
9 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
10 hours ago
