'సైరా' ప్రమోషన్స్ లో కనిపించని నయనతార... కారణం స్వయంగా చెప్పేసిందట!
Advertisement
చిరంజీవి హీరోగా నటించిన 'సైరా'లో హీరోయిన్ గా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా, సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు యూనిట్ మొత్తం ప్రయత్నిస్తున్న వేళ, నయనతార మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

అసలు సినిమా ప్రీ ఈవెంట్ కు కూడా ఆమె రాలేదు. సినిమా విడుదల తరువాత కూడా ఎక్కడా కనిపించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, అందుకు కారణాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయిందట నయన్. తాను ఏదైనా సినిమా ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నా, ప్రమోషన్స్ కు వచ్చినా, అవన్నీ ఫ్లాప్ అయ్యాయని, ఆ సెంటిమెంట్ తోనే తాను బయటకు రావడం లేదని చెప్పిందట. నయన్ మాటలు బయటకు వచ్చిన తరువాత, ఆమె ఇంత సెంటిమెంటలా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న నయన్, పెళ్లి విషయంలో మాత్రం నోరెత్తడం లేదు.
Sun, Oct 06, 2019, 10:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View