నితిన్ సినిమాకి 'చదరంగం' టైటిల్
Advertisement
యంగ్ హీరో నితిన్ నటించే ఓ సినిమాకి వెరైటీ టైటిల్ని నిర్ణయించే ఆలోచన చేస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. దీనికి 'చదరంగం' అనే టైటిల్ని దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యత వుంటుందట. పైగా కథలో కూడా ఈ ఆటలోలానే ఎత్తులు పైఎత్తులు బాగా ఉంటాయట. అందుకని ఆ టైటిల్ బాగా సరిపోతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే!    
Sat, Oct 05, 2019, 04:28 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View