మోహన్ లాల్ కుమారుడితో ప్రేమలో మునిగిపోయిన హీరోయిన్ కల్యాణి
Advertisement
ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం 'హలో' చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. తాజాగా కోలీవుడ్ లో కూడా ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే, కల్యాణి పూర్తిగా ప్రేమలో మునిగిపోయిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ ప్రియుడు మరెవరో కాదు. స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్.

మోహన్ లాల్, ప్రియదర్శన్ లు కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులు. వీరి స్నేహం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రణవ్, కల్యాణి లకు కూడా చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఇప్పుడు అది లవ్ ట్రాక్ పైకి ఎక్కింది.

తనపై వస్తున్న ప్రేమ వార్తలపై కల్యాణి ఇటీవల స్పందిస్తూ... తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న మాట నిజమేనని తెలిపింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం తన కుటుంబసభ్యులకు కూడా తెలుసని చెప్పింది. తన ప్రియుడి పేరు, వివరాలను ఇప్పుడు చెప్పనని తెలిపింది. తమ ప్రేమకు ఎలాంటి సమస్య లేదని చెప్పింది.
Sat, Oct 05, 2019, 10:56 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View