సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాలతార కాజల్ అగర్వాల్ కి ఆమధ్య అవకాశాలు తగ్గడంతో ఇక పెళ్లి చేసేసుకుని సినిమాలకి బై చెప్పేస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల అమ్మడికి మళ్లీ అవకాశాలు ఊపందుకోవడంతో పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కమిట్ అవుతున్న సినిమాలను లెక్కలోకి తీసుకుంటే, మరో మూడేళ్ల వరకు పెళ్లి ప్రస్తావన ఉండకపోవచ్చని అంటున్నారు.
*  'సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'జాన్'. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మిగతా షూటింగును మరో మూడు నెలల్లో పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  'సైరా' చిత్రం తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారు. తొలి షెడ్యూలును రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్న ప్రత్యేకమైన సెట్స్ లో నిర్వహిస్తారట.
Sat, Oct 05, 2019, 07:27 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View