మరోసారి తల్లి కాబోతున్న సినీ నటి స్నేహ
Advertisement
ప్రముఖ సినీ నటి స్నేహ మరోసారి తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నిన్న బంధుమిత్రుల మధ్య ఆమెకు సీమంతాన్ని నిర్వహించారు. తమిళ సినీ నటుడు ప్రసన్నను 2012లో స్నేహ ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 2015లో వీరికి విహాన్ అనే కుమారుడు జన్మించాడు. స్నేహ సీమంతం వేడుకల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తరుణ్ హీరోగా వచ్చిన 'ప్రియమైన నీకు' చిత్రంతో స్నేహ తొలి భారీ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించింది. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ... రాంచరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.
Fri, Oct 04, 2019, 05:36 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View