కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'రొమాంటిక్'
Advertisement
పూరి జగన్నాథ్ .. చార్మీ కలిసి 'రొమాంటిక్' సినిమాను నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి కథానాయకుడిగా అనిల్ పాదూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కేతిక శర్మ కథానాయికగా పరిచయం కానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి యూత్ ఎంతో ఆసక్తిని చూపుతోంది.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మాఫియాతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. కీలకమైన పాత్రల్లో బాలీవుడ్ కి చెందిన మకరంద్ దేశ్ పాండే .. మందిరా బేడీ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్ కి హిట్ ఇవ్వాలనే పూరి ప్రయత్నం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.
Thu, Oct 03, 2019, 06:31 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View