'మీకు మాత్రమే చెప్తా' రిలీజ్ డేట్ ఖరారు
Advertisement
విజయ్ దేవరకొండ నిర్మాతగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ .. వాణి భొజన్ .. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాకి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరించాడు.

పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుంటున్నాయి. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. మంచివాళ్లమనే పేరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆ ఇమేజ్ ను డామేజ్ చేసే చిన్నతప్పు జరిగినప్పుడు, దానిని సరిదిద్దుకునే క్రమంలో నుంచి పుట్టే కామెడీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.
Thu, Oct 03, 2019, 06:09 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View