ఆకట్టుకుంటోన్న 'ఎవ్వరికీ చెప్పొద్దు' ట్రైలర్
Advertisement
తెలుగు తెరను పలకరించే చిత్రాలలో ప్రేమకథాంశాలే ఎక్కువ. ప్రేమ అనే కథాంశం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది కనుక, ఆ కంటెంట్ తో యూత్ ను మెప్పించడానికి యువ దర్శకులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అలా బసవ శంకర్ దర్శకత్వంలో 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా రూపొందుతోంది. రాకేశ్ .. గార్గేయి ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు.

హీరోగా చేస్తోన్న రాకేశ్ ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేమ - కులం అనే అంశాల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఎవరికి వారు తమకి తెలిసిన సీక్రెట్ ను మరొకరితో చెప్పి, 'ఎవ్వరికీ చెప్పొద్దు' అంటూ వుంటారు. ఆ డైలాగ్ పైన .. 'మీ క్యాస్ట్ ఏంటి? అనే డైలాగ్ పైన ఈ ట్రైలర్ ను కట్ చేశారు.  
Thu, Oct 03, 2019, 05:30 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View