హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు
Advertisement
తెలుగు తెరపై యువ కథానాయకులతో బెల్లంకొండ శ్రీనివాస్ పోటీపడుతున్నాడు. 'అల్లుడు శీను' సినిమాతో హిట్ కొట్టిన ఆయన, ఆ తర్వాత మళ్లీ 'రాక్షసుడు' సినిమాతో హిట్ కొట్టడానికి చాలా సమయం పట్టింది. దాంతో ఆయన కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ .. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 1980 - 90 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Thu, Oct 03, 2019, 03:59 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View