పవన్ అభినందనలు ప్రత్యేకం: 'సైరా' కెమెరామెన్ రత్నవేలు
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా .. ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా 'సైరా నరసింహా రెడ్డి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కెమెరామెన్ గా రత్నవేలు పనిచేశాడు. సినిమా చూసిన వాళ్లంతా ఆయన పనితనాన్ని ప్రశంసిస్తున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ .. "డియర్ రత్నవేలు .. 'సైరా' గ్రాండ్ సక్సెస్ అయినందుకు అభినందనలు .. మీకు మున్ముందు మరింత మెరుగైన భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను" అంటూ ప్రశంసిస్తూ ఆయనకి గులాబీలను కానుకగా పంపించారు. ఈ విషయాన్ని గురించే రత్నవేలు స్పందిస్తూ, ఈ సినిమా నాకు అన్ని వైపుల నుంచి .. అందరివైపు నుంచి ఈ స్థాయి అభినందనలు తెచ్చిపెట్టడం ఆనందంగా వుంది. ఈ స్థాయి ప్రశంసలను నేను ఇంతవరకూ అందుకోలేదు. పవన్ కల్యాణ్ గారి అభినందనలు మాత్రం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే" అని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.
Thu, Oct 03, 2019, 02:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View