ఒకే సినిమాలో 25 గెటప్పులతో కనిపించనున్న విక్రమ్
Advertisement
తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆ తరహా కథలు ఆయన దగ్గరికి ఎక్కువగా వెళుతుంటాయి. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఇక ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్పులతో కనిపించనున్నాడని చెబుతున్నారు. తొలి షెడ్యూల్లోనే ఓ డిఫరెంట్ గెటప్పులో ఆయన షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు. ప్రపంచ సినీచరిత్రలో కథను బట్టి ఒకే సినిమాలో 25 గెటప్పులు వేసిన హీరోలు లేరట. అరుదైన ఆ రికార్డును దక్కించుకోవడం కోసమే విక్రమ్ రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Thu, Oct 03, 2019, 01:00 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View