తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' తొలిరోజు వసూళ్లు
Advertisement
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి 151వ చిత్రంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 38.76 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు.

చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం .. ఈ భారీ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించడం .. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇన్ని రకాల ప్రత్యేకతల కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లతో దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Thu, Oct 03, 2019, 12:24 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View