గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
Advertisement
తెలుగు తెరపై యాక్షన్ హీరోగాను .. మాస్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను గోపీచంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'చాణక్య' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేశాడు.

సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఇద్దరిపై బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇది గోపీచంద్ కి 28వ సినిమా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Thu, Oct 03, 2019, 11:39 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View