'భారతీయుడు 2'లో విలన్ గా అనిల్ కపూర్?
Advertisement
శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో కొంతకాలం క్రితం ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు శంకర్ రంగంలోకి దిగాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అనిల్ కపూర్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకి అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ లో మార్పులు జరగడం వలన, ఆయన డేట్స్ కుదరక తప్పుకున్నాడట. దాంతో దర్శక నిర్మాతలు అనిల్ కపూర్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని సమాచారం. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రకుల్ .. సిద్ధార్థ్ .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Tue, Oct 01, 2019, 06:00 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View