వేణుమాధవ్ మా అబ్బాయేనని చాలామంది అనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో వేణు మాధవ్ ను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "వేణుమాధవ్ ను నేను మొదటిసారిగా 'రవీంద్రభారతి'లో చూశాను. స్టేజ్ పై ఆయన నా వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఉండగా నేను చూడటం విశేషం. ఎస్వీ కృష్ణారెడ్డిగారి ద్వారా సినిమాల్లోకి వచ్చిన వేణుమాధవ్, ఆ తరువాత మేము రాసిన చాలా సినిమాల్లో నటించాడు. 'డాడీ' అంటూ నన్ను చాలా చనువుగా పిలిచేవాడు. సినిమా ఫంక్షన్స్ లో నా వాయిస్ ను అనుకరించేవాడు.

దాంతో వేణుమాధవ్ మా అబ్బాయేనని చాలామంది అనుకున్నారు. నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చిన వాళ్లు, 'మీ అబ్బాయి వేణుమాధవ్ ను పిలవండి ఆయనను కూడా చూసి వెళ్లిపోతాము' అనేవారు. తెరపై వేణుమాధవ్ ను చూసి కొంతమంది 'పరుచూరి గోపాలకృష్ణగారి అబ్బాయి' కావొచ్చునని అనుకోవడం మా అమ్మాయివాళ్లు విన్నారట. ఎందుకో తెలియదుగానీ భగవంతుడు మా ఇద్దరికీ దగ్గరి పోలికలు ఇచ్చాడు" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 01, 2019, 04:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View