కొత్తవాళ్లతో నేను తొందరగా కలవలేను: హీరో గోపీచంద్
Advertisement
గోపీచంద్ కథానాయకుడిగా 'తిరు' దర్శకత్వంలో రూపొందిన 'చాణక్య' అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో గోపీచంద్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నా సినిమాలో ఏయే అంశాలు వుండాలని అభిమానులు కోరుకుంటారో, ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా నాకు సక్సెస్ ను తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను" అని అన్నారు.

మరో ప్రశ్నకి సమాధానంగా .. "మొదటి నుంచి కూడా నాకు కాస్త మొహమాటం ఎక్కువ .. కొత్తవాళ్లతో వెంటనే కలవలేను. వాళ్లతో మాటలు కలపడానికి .. దగ్గర కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఒకసారి పరిచయమైన తరువాత వాళ్లతో ఇక చనువుగానే వుంటాను. ఇండస్ట్రీలోని హీరోలందరితోను చాలా ఫ్రెండ్లీగా వుంటాను. ప్రభాస్ తో మాత్రం ఎక్కువ చనువుగా వుంటాను" అని చెప్పుకొచ్చారు.
Tue, Oct 01, 2019, 02:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View