కోటి వ్యూస్ ను రాబట్టేసిన 'సామజవరగమన' సాంగ్
Advertisement
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'సామజవరగమన' అనే పాటను విడుదల చేశారు.

తమన్ బాణీకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాటకి 60 లక్షల వ్యూస్ రాగా, 3 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పటికి ఈ పాట కోటి వ్యూస్ ను రాబట్టేసింది. ఇటీవల కాలంలో ఇంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను .. లైక్స్ ను అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ మరొకటి లేదని చెబుతున్నారు. తమన్ బాణీలో కొత్తదనం .. సిరివెన్నెల పదాల్లోని అందమైన అల్లిక .. సిద్ శ్రీరామ్ వాయిస్ లోని ప్రత్యేక ఈ పాటకి ఈ స్థాయి ఆదరణ తెచ్చిపెట్టాయని చెప్పుకుంటున్నారు.
Tue, Oct 01, 2019, 12:57 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View