'ప్రేమదేశం'తో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది: హీరో వినీత్
Advertisement
'సరిగమలు' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన వినీత్, ఆ తరువాత 'ప్రేమదేశం' సినిమాతో తెలుగులో పాప్యులర్ అయ్యాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వినీత్ మాట్లాడుతూ 'ప్రేమదేశం' సినిమా గురించి ప్రస్తావించాడు.

"తమిళంలో 'కాదల్ దేశం' సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అప్పటికి తమిళంలో నేను రెండు మూడు సినిమాలు చేసి వున్నాను. అబ్బాస్ కి మాత్రం అదే మొదటి సినిమా. ఒకచోట అబ్బాస్ తారసపడగా దర్శకుడు కథిర్ ఆయనను ఈ సినిమాతో హీరోగా చేసేశాడు. నాతో అబ్బాస్ చాలా చనువుగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు.

ఇక 'టబు' ఎంత గొప్ప నటి అనేది ఈ సినిమాతో నాకు తెలిసింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాను అలా నిలబెట్టేసింది. ఈ సినిమాతో మా అందరికీ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా నాకు చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Oct 01, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View