ఫిట్ నెస్ కోసం అజిత్ కసరత్తులు!
Advertisement
తమిళనాట వరుస విజయాలను నమోదు చేయడంలో విజయ్ .. అజిత్ ఇద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ చేసిన 'నెర్కొండ పార్వై' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో ఇంటెలిజెంట్ లాయర్ పాత్రలో అజిత్ అదరగొట్టేశాడు. ఈ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాను వెంటనే మొదలుపెట్టేశాడు.

బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఈ సినిమాలో అజిత్ మరింత ఫిట్ నెస్ తో కనిపించవలసి ఉందట. అందువలన ఆయన జిమ్ లో గట్టి కసరత్తులు చేస్తున్నాడని అంటున్నారు. 'వివేకం' సినిమాలో మంచి ఫిట్ నెస్ తో అభిమానులను మెప్పించిన అజిత్ అదే తరహాలో ఈ సినిమాలో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలియనున్నాయి.
Tue, Oct 01, 2019, 11:55 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View