'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము రేపింది!
Advertisement
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అర్ధరాత్రి నుంచే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో ఉండటంతో... ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది.

మరోవైపు, 'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఒక్క తెలుగు వర్షన్ లోనే దాదాపు రూ. 150 కోట్ల బిజినెస్ జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 108 కోట్ల బిజినెస్ జరిగింది. విదేశాల్లో తెలుగు రైట్స్ తో కలుపుకుంటే ఇది రూ. 150 కోట్లకు చేరింది. మరోవైపు కన్నడలో కూడా ఈ చిత్రం చేసిన బిజినెస్ మామూలుగా లేదు. ఏకంగా రూ. 27 కోట్ల వరకు బిజినెస్ చేసింది. హిందీ వర్షన్ విషయంలో కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉండటంతో... బాలీవుడ్ లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది.
Tue, Oct 01, 2019, 10:38 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View