సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అటు హీరోయిన్ గా నటిస్తూనే, అప్పుడప్పుడు స్పెషల్ సాంగులలో డ్యాన్స్ చేసే తమన్నా తాజాగా మహేశ్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం పక్కా మాస్ బీట్ తో పాటను కంపోజ్ చేస్తున్నాడట.
*  పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం హిందీ అనువాద వెర్షన్ మాత్రం యూ ట్యూబ్ లో దుమ్మురేపేసింది. గత ఏడాది అక్టోబర్లో యూ ట్యూబ్ లో దీనిని పెట్టగా, ఇప్పటికి 100 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది.
*  హీరోగానే కాకుండా అప్పుడప్పుడు ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలు కూడా పోషిస్తున్న తమిళ హీరో విజయ్ సేతుపతి తాజాగా స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ తన 64వ చిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
Tue, Oct 01, 2019, 07:33 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View