ఇలాంటి సినిమాలు తీయడంలో రవిబాబును మించినోడు లేడు: మహేశ్ బాబు
Advertisement
గతకొంతకాలంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే తీస్తున్న దర్శకనటుడు రవిబాబు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా పేరు 'ఆవిరి'. ఈ చిత్రంలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, హిమజ, ముక్తార్ ఖాన్ తదితరులు నటించారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న 'ఆవిరి' చిత్రం టీజర్ ఆదివారం విడుదలైంది. దీనిపై అగ్రహీరో మహేశ్ బాబు స్పందించారు. హారర్ కథాంశంతో చిత్రాలు తీయడంలో రవిబాబుది అందెవేసిన చేయి అని కితాబిచ్చారు. ఇలాంటి జానర్ లో వచ్చిన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన 'ఆవిరి' చిత్రం అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon, Sep 30, 2019, 09:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View