'సరిలేరు నీకెవ్వరు'లో మెరవనున్న పూజా హెగ్డే?
Advertisement
తెలుగు తెరపై ఇప్పుడు పూజా హెగ్డే జోరు కనిపిస్తోంది. వరుస సక్సెస్ ల కారణంగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ మొదలైపోయిన కొన్ని పెద్ద సినిమాల్లో ఆమె కనిపించేలా చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. అలా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఒక పాటను పూజా హెగ్డేపై చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి రూపొందిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. ఒక ప్రత్యేక గీతం కోసం తమన్నాను తీసుకున్నారు. ఏ సందర్భంలో వస్తుందో తెలియదుగానీ, మరో పాట కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరికాస్త గ్లామర్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మహేశ్ బాబుతో కలిసి 'మహర్షి' సినిమాలో పూజా హెగ్డే ఆడిపాడిన సంగతి తెలిసిందే.
Mon, Sep 30, 2019, 06:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View