చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ.. షూటింగ్ చూసి ఉద్వేగం చెందిన చిరూ దంపతులు
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంటే చిరంజీవి దంపతులు చూడటానికి వెళ్లారట.

సీతారామరాజు విప్లవ వీరుడిగా మారే క్రమంలో ఆయనకి ఎదురైన ఒక సంఘటనగా, తాళ్లతో కట్టి కొడుతూ ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఆ సన్నివేశాన్ని రాజమౌళి చాలా సహజంగా చిత్రీకరిస్తూ ఉండటంతో చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారట. సీతారామరాజుకి ఎదురైన పరిస్థితి .. రాజమౌళి చిత్రీకరిస్తోన్న విధానం .. ఆ సన్నివేశానికి ప్రాణం పోయడానికి చరణ్ పడుతున్న కష్టం వాళ్లను ఉద్వేగానికి గురిచేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. 2020లో జూలై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon, Sep 30, 2019, 06:13 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View