రవితేజకు జోడీగా శ్రుతి హాసన్!
Advertisement
తెలుగు .. తమిళ భాషల్లో నాజూకు కథానాయికగా శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక్కడ కెరియర్ మంచి జోరుగా సాగుతోన్న సమయంలోనే బాలీవుడ్ పై ఆసక్తిని చూపుతూ అక్కడికి వెళ్లింది. అక్కడ అవకాశాలు వస్తుండగానే ప్రేమలో పడి కెరియర్ పై శ్రద్ధ పెట్టడం మానేసింది. ఫలితంగా ఈ మూడు భాషల్లోను ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి .. ప్రేమ కూడా విఫలమైపోయింది. దాంతో తిరిగి ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది.

 ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఆమెను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా చేయడానికి శ్రుతి హాసన్ అంగీకరించిందనేది తాజా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
Mon, Sep 30, 2019, 05:15 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View