మేమంత అడగలేదు.. చిరంజీవి అబద్ధం చెబుతున్నారు: ఉయ్యాలవాడ కుటుంబీకులు
Advertisement
చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. మరోవైపు, ఈ చిత్రం విడుదలపై గత కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ సమయంలో తమకు ఇచ్చిన హామీలను చిరంజీవి, రామ్ చరణ్ లు నిలబెట్టుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ నరసింహారెడ్డి వారసులమంటూ 23 కుటుంబాల వారు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 కోట్లు చొప్పున డిమాండ్ చేస్తున్నారని... దాదాపు రూ. 50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలపై ఉయ్యాలవాడ కుటుంబీకులు స్పందిస్తూ... చిరంజీవి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చరణ్ చెప్పినట్టుగా తాము ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు అడిగామని తెలిపారు. సినిమాకు సంబంధించి తాము వేసిన కేసులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు.
Mon, Sep 30, 2019, 04:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View