దిల్ రాజు నిర్మాతగా వరుణ్ తేజ్ కొత్త సినిమా
Advertisement
విభిన్నమైన కథాంశాలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వరుణ్ తేజ్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. 'గద్దలకొండ గణేశ్'తో ఆయన తాజా విజయాన్ని అందుకున్నాడు. అలాంటి వరుణ్ తేజ్ తో ఒక సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాన్ని దిల్ రాజు మొదలెట్టినట్టుగా సమాచారం. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

గతంలో వరుణ్ తేజ్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన 'తొలిప్రేమ' విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ ను దిల్ రాజు మళ్లీ సెట్ చేసే పనిలో వున్నారని అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం, కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, దిల్ రాజు ప్రాజెక్టు మొదలవుతుందని అంటున్నారు.
Mon, Sep 30, 2019, 04:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View