'సైరా' పక్కనే 'చాణక్య' రావడానికి కారణమదే: హీరో గోపీచంద్
Advertisement
గోపీచంద్ కథానాయకుడిగా రూపొందిన 'చాణక్య' వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్ లో బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'సైరా' సినిమాకి చాలా దగ్గరలో 'చాణక్య' విడుదల చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే 'చాణక్య'ను ముందుగా మేము 'మే' నెలలో విడుదల చేయాలనుకున్నాము.

షూటింగులో నాకు ప్రమాదం జరగడం వలన, అక్టోబర్ 3వ తేదీన విడుదల చేయాలని అనుకున్నాము. అప్పటికి ఇంకా 'సైరా' సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. 'సైరా'ను అక్టోబర్ 2వ తేదీకి ఫిక్స్ చేసిన తరువాత, మేము అక్టోబర్ 3 నుంచి 5కి వెళ్లాము. పండుగ సెలవులు ఎక్కువగా ఉండటం వలన, 'సైరా' జోనర్ .. 'చాణక్య' జోనర్ వేరు వేరు కావడం వలన మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.
Mon, Sep 30, 2019, 02:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View