'సైరా' క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుంది!: దర్శకుడు సురేందర్ రెడ్డి
Advertisement
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందింది. చిరంజీవి 151వ చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా, ఐదు భాషల్లో అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ వినగానే దేశభక్తితో నా రోమాలు నిక్క బొడుచుకున్నాయి. ఆయన గురించిన సమాచారం కోసం ఎంతో పరిశోధన చేశాను.

చివరి సమయంలో ఆయన వెనుక పదివేల సైన్యం ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టి వుంటారో .. ఆయనని ఆంగ్లేయులు ఎంతగా బాధపెట్టి వుంటారో అనిపించింది. ఈ కోణంలోనే నేను క్లైమాక్స్ ను డిజైన్ చేసుకున్నాను. ఈ క్లైమాక్స్ ను అనేక మార్లు తెరపై చూసుకున్నాను. చూసిన ప్రతిసారి నా హృదయం ఉప్పొంగింది. ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Mon, Sep 30, 2019, 02:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View