హీరో రామ్ ఇచ్చిన గిఫ్ట్ తో ఎంజాయ్ చేసిన పూరి జగన్నాథ్.. వీడియో చూడండి
Advertisement
'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి జోష్ లో ఉన్నారు. ఈ నెల 28న తన పుట్టినరోజును జగన్ ఘనంగా చేసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా 'ఇస్మార్ట్ శంకర్'తో బంపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న హీరో రామ్... పూరి జగన్నాథ్ కు ఓ గిఫ్ట్ ను ఇచ్చాడు. గోల్డ్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్ ను బహూకరించాడు. ఈ స్పీకర్ ద్వారా 'ఇస్మార్ట్ శంకర్' పాటలు వింటూ జగన్ ఎంజాయ్ చేశారు. జగన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఛార్మి ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ స్పీకర్ ఖరీదు దాదాపు 4 వేల డాలర్స్. మరోవైపు, తాజాగా తన కుమారుడు ఆకాశ్ పూరితో 'రొమాంటిక్' అనే చిత్రాన్ని ప్రారంభించాడు.

Mon, Sep 30, 2019, 02:11 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View