మర్డర్ మిస్టరీ నేపథ్యంలో 'క్లైమాక్స్'
Advertisement
హాస్యకథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్, ఆ తరువాత ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఒక వైపున బరువైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధాన పాత్రలను అంగీకరిస్తున్నారు. అలా ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న చిత్రమే 'క్లైమాక్స్'.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పాత్ర పేరు మోడీ కావడం విశేషం. రాజేశ్వర్ రెడ్డి- కరుణాకర్ రెడ్డి నిర్మాణంలో భవానీ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వైట్ హెయిర్ .. గెడ్డం .. మీసాలతో ఆయన లుక్ కొత్తగా వుంది. బ్లాక్ లాంగ్ కోటుతో వున్న ఆయన, చిత్రమైన టాటూలతో కనిపిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. రాజేశ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా గురించిన మిగతా విషయాలు త్వరలో తెలియనున్నాయి.
Mon, Sep 30, 2019, 01:44 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View