బెల్లంకొండపై దృష్టిపెట్టిన శ్రీను వైట్ల
Advertisement
తెలుగులో అగ్రదర్శకుడి స్థానాన్ని దక్కించుకున్న శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస పరాజయాలతో వెనుకబడ్డాడు. ఎప్పటికప్పుడు సక్సెస్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా ఆయన తనవంతు ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు.

తాజాగా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ పై తన దృష్టిపెట్టినట్టుగా సమాచారం. తాను సిద్ధం చేసుకున్న కథకు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. కథ విన్న బెల్లంకొండ ఇంకా తన వైపు నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. ఆయన సమాధానం కోసమే శ్రీను వైట్ల వెయిట్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ మధ్యనే 'రాక్షసుడు'తో హిట్ అందుకున్న బెల్లంకొండ, శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
Mon, Sep 30, 2019, 12:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View