'ఆవిరి' నుంచి మరో టీజర్ రిలీజ్
Advertisement
నటుడిగా రవిబాబు విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. దర్శకుడిగా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా తాజాగా ఆయన రూపొందించిన చిత్రమే 'ఆవిరి'. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ కి .. ఫస్టు టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా ఆయన మరో టీజర్ ను వదిలాడు. కంటికి కనిపించకుండా ఆత్మ చేసే పనులకి సంబంధించిన సన్నివేశాలపైనే ఆయన ఈ టీజర్ ను కట్ చేశాడు.

ప్రతి సీన్ ను ఆయన చాలా నీట్ గా .. పెర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించాడనే విషయం టీజర్ ను బట్టే అర్థమైపోతుంది. నేహా చౌహాన్ .. భరణి శంకర్ . ముక్తాఖాన్ .. శ్రీముక్తా .. హిమజ .. కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అవును' తరహాలో ఈ హారర్ థ్రిల్లర్ కూడా రవిబాబుకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Mon, Sep 30, 2019, 11:50 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View