త్రివిక్రమ్ తో సినిమా ఉందని చెప్పిన చిరూ
Advertisement
చిరంజీవి తాజా చిత్రంగా రూపొందిన 'సైరా' .. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. నవంబర్లో ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టు తరువాత చిరంజీవి - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ధ్రువీకరించారు. 'సైరా' ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ, త్రివిక్రమ్ గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్ తనకి ఇటీవల ఒక లైన్ వినిపించాడని అన్నారు. ప్రస్తుతం పూర్తి కథపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. పూర్తి వినోదభరితంగా ఆ కథ నడుస్తుందని అన్నారు. చిరూతో పనిచేయాలనే త్రివిక్రమ్ ముచ్చట .. ఆయన సినిమా చేయాలనే చిరూ కోరిక త్వరలో తీరబోతున్నాయన్న మాట.
Mon, Sep 30, 2019, 11:31 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View