'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' విడుదల తేదీ ఖరారు
26-09-2019 Thu 18:53
- ఆది సాయికుమార్ నుంచి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
- ప్రతినాయకుడిగా అబ్బూరి రవి
- అక్టోబర్ 18న విడుదల

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందింది. శషా ఛెత్రి .. నిత్య నరేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. రావు రమేశ్ .. వినాయకుడు .. పార్వతీశం ముఖ్య పాత్రలను పోషించారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను .. వాళ్లు ఎదుర్కునే పరిస్థితులను ఈ సినిమాలో కళ్లకు కట్టారట.
ఈ సినిమాలో తను ఎన్.ఎస్.జి. కమెండోగా కనిపిస్తాననీ, తన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆది సాయికుమార్ అన్నాడు. "శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అబ్బూరి రవి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు. నటుడిగా కూడా ఆయన బిజీ అయ్యేలా ఈ సినిమా చేస్తుంది. ఈ సినిమా టీమ్ అంతా కూడా నిర్మాణ భాగస్వాములు కావడం విశేషం. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కొత్త కేసులు
8 hours ago

మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబు నివాసాలకు నిప్పంటించిన ఆందోళనకారులు... రగులుతున్న కోనసీమ
10 hours ago

'ఎఫ్ 3' హిట్ తమన్నాకు కూడా కీలకమే!
10 hours ago
