‘పోలవరం’ రివర్స్ టెండరింగ్.. ప్రధాన కాంట్రాక్టును దక్కించుకున్న ‘మేఘా ఇంజనీరింగ్’
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా, ‘పోలవరం’ ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాలకు జలవనరుల శాఖ రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఈ టెండర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది.

 ఈ పనులకు రూ.4,987.55 కోట్లను ఇనిషియల్ బెంచ్ మార్క్ (ఐబీఎం) విలువగా ప్రభుత్వం నిర్ణయించింది. అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువకు, రూ.4359 కోట్లకు ‘మేఘా’ సంస్థ కోట్ చేసి, ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో, ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. కాగా, జలవనరుల శాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు గడువు లోగా బిడ్ దాఖలు చేసింది ‘మేఘా’ సంస్థ మాత్రమే. ప్రీ బిడ్ సమావేశానికి ఎనిమిది సంస్థలు హాజరై తమ సందేహాలను తీర్చుకున్నప్పటికీ, 'మేఘా' తప్ప మిగతావి మాత్రం బిడ్ లో పాల్గొనకపోవడం విశేషం.
Mon, Sep 23, 2019, 05:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View