'సైరా' సెన్సార్ పూర్తి.. రిలీజ్ కి సర్వం సిద్ధం
Advertisement
చిరంజీవి కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రంగా 'సైరా' అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైంది. వివిధ భాషలకి సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భాషలన్నింటిలోను ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఒక్క కట్ కూడా చెప్పకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేయడం ఒక విశేషం అయితే, విడుదలకు వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం మరో విశేషం. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా .. అనుష్క ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ ముగ్గురికి విపరీతమైన క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. 
Mon, Sep 23, 2019, 04:50 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View