త్రివిక్రమ్ కి ప్రమోషనల్ సాంగ్ వదిలే ఆలోచన లేదట
Advertisement
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా రెండు మూడు రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది.

అందులో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజా సమాచారం. ఇంతవరకూ త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించలేదు. ఆయనకి ఆ ఆలోచన కూడా లేదనేది సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను దసరాకి గానీ .. దీపావళికిగాని విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.
Mon, Sep 23, 2019, 03:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View