శాసనమండలికి గౌరవం ఇవ్వడం లేదు.. మండలిలో ఆర్థికమంత్రితోనే సరిపెడుతున్నారు: కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనమండలికి కేసీఆర్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మండలిలో కేవలం ఆర్థికమంత్రితోనే సరిపెడుతున్నారని అన్నారు. శాసనసభలో లేవనెత్తిన అంశాలకు మండలిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ... పట్టించుకోవడం లేదని చెప్పారు. పలు అంశాలపై మండలిలో సమాధానాలు దొరకడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 720 మెడికల్ సీట్లను గిరిజనులు నష్టపోయారని తెలిపారు. గల్ఫ్ బాధితులకు ఆర్థిక సాయం అందడం లేదని విమర్శించారు.
Mon, Sep 23, 2019, 03:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View