ఉల్లిపాయలు బ్లాక్ మార్కెట్ కు తరలించినవారిపై కఠినచర్యలు: మంత్రి మోపిదేవి
Advertisement
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు కొండెక్కుతుండడంపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధర పెరుగుదలకు కృత్రిమ కొరతే కారణమని స్పష్టం చేశారు. ఉల్లిపాయలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తగినంత మేర ఉల్లిని మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి అందుబాటులో ఉంచాలని అన్నారు. కాగా, వర్షాలు, వరదల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నదని అధికారులు మంత్రికి వివరించారు.
Mon, Sep 23, 2019, 03:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View