పారదర్శకత మాటల్లో కాదు... చేతల్లో చూపించాలి: పేపర్ లీక్ పై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Advertisement
ఏపీలో ఇటీవలే జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్లు ముందే లీక్ అయ్యాయంటూ వస్తున్న వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పారదర్శకత మాటల్లో కాదని చేతల్లో చూపించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అన్నారు. వ్యవస్థ కారణంగా యువత ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని పవన్ హితవు పలికారు. జీవితాలు మారతాయన్న కొండంత ఆశతో అభ్యర్థులు పరీక్ష రాశారని, పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.
Sat, Sep 21, 2019, 08:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View