మమ్మల్ని మోసం చేశారు... చిరంజీవి, రామ్ చరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ వంశీయులు
Advertisement
సైరా చిత్రకథ విషయంలో తమతో ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ తుంగలో తొక్కారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చిరంజీవి నివాసం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉయ్యాలవాడ వంశీకులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు అవసరమైన వివరాలను తమ నుంచే సేకరించి, తిరిగి తమ మీదనే కేసులు పెట్టారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నరసింహారెడ్డి గురించిన సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెప్పి, మాట తప్పారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
Sat, Sep 21, 2019, 08:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View