జగన్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉంది: పంచుమర్తి అనురాధ
Advertisement
వైసీపీ పాలనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో తిరిగే ధైర్యం జగన్ కు లేదని, జగన్ మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. జాతీయ మీడియాలో సైతం వైసీపీ సర్కారును విమర్శిస్తూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. నవరత్నాలను వదిలేశారని, అన్ని అంశాల్లో వైసీపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అరిచి గోల చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని హితవు పలికారు.
Sat, Sep 21, 2019, 05:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View