నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
Advertisement
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నంలో ఒకే కేటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు విశాఖలోని ఓ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు వ్యానులో ఏలూరు వైపు వెళ్తున్నారు.

నల్లజర్ల వద్దకు వీరి వ్యాను వచ్చే సరికి ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఓ పురుషుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దారిలో ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగిలిన వారికి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో వ్యాన్‌ డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Fri, Sep 20, 2019, 12:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View