లేటు వయసులో రిస్కీ సరదాలు.. 98 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన తాతగారు.. వీడియో!
Advertisement
సాధారణంగా 98 ఏళ్ల వయసు వచ్చిదంటే చాలామంది కదలలేని స్థితికి చేరుకుంటారు. చాలాకొద్ది మంది మాత్రం లేచి తిరుగుతూ తమ పనులు తాము చేసుకుంటారు. కానీ అమెరికాకు చెందిన కైల్ రైస్ మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈయనకు 98 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ హాయిగా స్కైడైవింగ్ చేసేస్తున్నారు. తాజాగా నెదర్లాండ్స్ లోని గ్రోస్ బీక్ ప్రాంతంలో ఓ విమానం ద్వారా 42.4 మీటర్లు స్కై డైవింగ్ చేశారు.

జన్మత: అమెరికా పౌరుడైన  రైస్  1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్ లో శత్రువులు ఆక్రమించుకున్న భూభాగాన్ని విముక్తం చేసేందుకు జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడారు. ఈ ఘటనకు 75 సంవత్సరాలు పూర్తియిన నేపథ్యంలో కైల్  రైస్  మరోసారి స్కైడైవింగ్ చేశాడు. అన్నట్లు తనకు వందేళ్లు వచ్చేవరకూ స్కైడైవింగ్ చేస్తూనే ఉంటానని కైల్  రైస్  ప్రకటించడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Fri, Sep 20, 2019, 12:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View