కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ ను నిలిపివేసిన కలెక్టర్!
Advertisement
వరుణ్ తేజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుపై పలు వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ ‘14 రీల్స్’ సినిమా పేరును గద్దలకొండ గణేష్ గా మార్చేసింది.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురయింది. నేడు కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారు. ఏపీ హైకోర్టు నుంచి తమకు అధికారిక ఆదేశాలు ఇంకా అందలేదనీ, అందుకే సినిమాను ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. దీంతో కర్నూలులో ఈ సినిమా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయమై అస్పష్టత నెలకొంది. ఈరోజు గద్దలకొండ గణేష్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
Fri, Sep 20, 2019, 11:56 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View