టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు ఏపీ హైకోర్టు నోటీసులు!
Advertisement
తెలుగుదేశం నేత, గుంటూరు పశ్చిమం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. గిరిధర్ ఎన్నిక చెల్లందటూ వైసీపీ నేత ఏసురత్నం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఏసురత్నం తరఫు న్యాయవాది వాదిస్తూ.. గిరిధర్ రావు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనీ, అఫిడవిట్ లో తప్పుడు వివరాలు దాఖలు చేశారని తెలిపారు. ఆయన మొత్తం 5 పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేశారని ఆరోపించారు.

ఎన్నికల సందర్భంగా  రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో)తో కుమ్మక్కయిన గిరిధర్ రావు 4,040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా, 312 మాత్రమే చెల్లేట్లు చేశారని విమర్శించారు. ఆయన్ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎమ్మెల్యే మద్దాలి, ఆర్వోకు నోటీసులు జారీచేశారు. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.
Fri, Sep 20, 2019, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View