చిరంజీవి 'సైరా' ట్రైలర్ పై అమీర్ ఖాన్ స్పందన!
Advertisement
చిరంజీవి తాజా చిత్రం 'సైరా' అక్టోబర్ 2న విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజగా ఈ ట్రైలర్ పై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పందించారు. ''సైరా' ట్రైలర్ చూశా. అద్భుతంగా ఉంది. చిరంజీవి గారికి పెద్ద అభిమాని అయిన నేను... ఈ సినిమా చూసేవరకు ఆగలేకపోతున్నా. చిరంజీవి సార్, రామ్ చరణ్, మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్' అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Fri, Sep 20, 2019, 11:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View